Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రవితేజతో చేస్తున్నది 'బంగార్రాజు' కథ కాదు.. పుకార్లు నమ్మొద్దు : కల్యాణ్ కృష్ణ

  • నాగ్ కి క్రేజ్ తెచ్చిపెట్టిన 'బంగార్రాజు' పాత్ర 
  • ముందుగా రెడీ చేసిన వెర్షన్ పట్ల నాగ్ అసంతృప్తి 
  • మరో వెర్షన్ రెడీ చేసే పనిలో కల్యాణ్ కృష్ణ
  • రవితేజతో ప్లాన్ చేస్తున్నది వేరే కథ
నాగార్జున కథానాయకుడిగా దర్శకుడు కల్యాణ్ కృష్ణ ఆ మధ్య 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాను తెరకెక్కించాడు. నాగార్జున కెరియర్లోనే ఈ సినిమా భారీ విజయంగా నిలిచింది. ఈ సినిమాలో నాగార్జున పోషించిన 'బంగార్రాజు' పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో అదే పాత్రను ప్రధానంగా చేసుకుని మరో కథను సిద్ధం చేయమని నాగ్ కోరడం .. కల్యాణ్ కృష్ణ ఓకే అనడం జరిగిపోయాయి. 'బంగార్రాజు' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్టుగా కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి.

 అలాంటి ఈ సినిమాను రవితేజతో కల్యాణ్ కృష్ణ తెరకెక్కించనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ ప్రచారంపై తాజాగా కల్యాణ్ కృష్ణ స్పందించాడు. "నేను రవితేజతో సినిమాను ప్లాన్ చేస్తోన్న మాట నిజమే .. అయితే అది 'బంగార్రాజు' కథ కాదు. 'బంగార్రాజు'కి సంబంధించి ఒక వెర్షన్ ను నాగ్ కి వినిపిస్తే ఆయనకి నచ్చలేదు. దాంతో మరో వెర్షన్ ను సిద్ధం చేస్తున్నాను. ఎప్పటికైనా ఈ కథను నాగార్జునతోనే చేస్తాను .. ఆయనే ఈ సినిమాలో హీరో. ఇక రవితేజతో చేయాలనుకుంటున్నది కామెడీ ప్రధానంగా కొనసాగే వేరే కథ. అందువలన అనవసరపు ప్రచారాలు నమ్మొద్దు" అని తేల్చి చెప్పాడు.  
kalyan krishna

More Telugu News